by సూర్య | Sat, Sep 14, 2024, 06:54 PM
మిలన్ ఫ్యాషన్ వీక్ కోసం బయలుదేరిన రష్మిక మందన్న ఈరోజు ఉదయం విమానాశ్రయంలో అందరి దృష్టినీ ఆకర్షించారు. అందమైన , ట్రెండీ దుస్తులలో మెరిసారు. ఆమె ఫోటోగ్రాఫర్ల కోసం ఫోజులు ఇస్తూ.. తనదైన శైలిలో అందరినీ అలరించారు.గత సంవత్సరం, రష్మిక తన అద్భుతమైన నలుపు రంగు గౌనుతో అందరినీ ఆశ్చర్యపరిచారు, అభిమానులు , విమర్శకుల హృదయాలను ఒకేసారి గెలుచుకున్నారు. ఈ ఏడాది, ఆమె డ్రెస్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆమె తన ఫ్యాషన్-ఫార్వర్డ్ లుక్‌తో ఎలా మెరిసిపోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె గత ప్రదర్శన అద్భుతంగా ఉంది, ఈ సంవత్సరం ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కూడా అంతే అందంగా ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. “మిలన్ ఫ్యాషన్ వీక్ 2024లో ఆసియా నుండి వచ్చిన అనేక మంది ప్రముఖులతో పాటు రష్మిక రెండోసారి ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు” అని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
రష్మిక మందన్న టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. పుష్ప 2: ది రూల్‌లో శ్రీవల్లిగా ఆమె పాత్రతో సహా, సల్మాన్ ఖాన్‌తో సికందర్, ధనుష్ మరియు నాగార్జునతో కుబేర, విక్కీ కౌశల్‌తో చావ, దేవ్ మోహన్‌తో రెయిన్‌బో, ఆయుష్మాన్ కురానాతో వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ మరియు రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ పార్క్ వంటి సినిమాలతో ఆమె తన సత్తా చాటుతోంది.
Vasthuga Penchanitta Vanda Kotla Sogasiri
Asthiga Allesukoo Kosari Kosari...#JrNTR #RashmikaMandhana @iamRashmika #Devara pic.twitter.com/IrMgsDtX0C
— Rashmika Lover'(@Rashuu_lovers) September 14, 2024