శేఖర్ కమ్ముల నెక్ట్స్ ప్రాజెక్టు ఖరారు
by సూర్య |
Sat, Sep 14, 2024, 06:50 PM
శేఖర్ కమ్ముల ‘ఆనంద్’కు ముందు సినిమాలు చేసినా ‘ఓ మంచి కాఫీ లాంటి సినిమా’ అంటూ వచ్చిన ఆనంద్ సినిమాతోనే ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ తరువాత శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోదావరి’ కొందరిని మాత్రమే ఆకట్టుకోగలిగింది. అయితే ఈ రెండు చిత్రాలతోనూ ఉత్తమ దర్శకునిగా నందిని సొంతం చేసుకున్నారు శేఖర్. ఆ పై వచ్చిన శేఖర్ సినిమా ‘హ్యాపీ డేస్’ టైటిల్ కు తగ్గట్టుగానే ఎందరికో ఆనందమైన రోజులు చూపించింది.రానా హీరోగా నటించిన తొలి చిత్రం ‘లీడర్’ శేఖర్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా, లవ్ స్టోరీ” చిత్రాలతో తనదైన మార్కు చూపిస్తూ ఆకట్టుకున్నారు శేఖర్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కుబేర పేరుతో వస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తున్నారు. అంతేకాదు స్టార్స్ తో ఆయన చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం.
ఈ చిత్రం పూర్తి కావొస్తున్న నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రం ఏమిటైనే చర్చ మొదలైంది. ఈ నేపధ్యంలో శేఖర్ కమ్ముల నెక్ట్స్ చిత్రం ఏమిటనేది ప్రచారంలోకి వచ్చింది. అదేమిటో చూద్దాం. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు శేఖర్ కమ్ముల....నాని కోసం కథ రెడీ చేసినట్టు సమాచారం. నానితో పనిచేయాలనే ఆసక్తి శేఖర్ కమ్ములకు ఎప్పటినుంచో ఉంది.అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడానికి నాని కూడా ఉత్సాహంగా ఉన్నాడనే గతంలోనే పలు వార్తలు చూశాం. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ కూడా కమ్ముల రెడీ చేసినట్లు టాక్. నానికి జోడిగా హీరోయిన్ సాయి పల్లవి ని తీసుకోవాలని వార్తలు వస్తున్నాయి.వాస్తవానికి బలగం వేణు డైరక్షన్ లో నాని సినిమా చెయ్యాల్సి ఉంది. దిల్ రాజు ఆ సినిమాని నిర్మించనున్నారు. అయితే నాని ...శేఖర్ కమ్ముల వైపు మ్రొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం హీరో నాని హిట్ 3 కోసం రెడీ అవుతుండగా..అలాగే సుజిత్ డైరెక్షన్‌లో ఒక సినిమా, దసరా డైరెక్టర్ తో మరో సినిమాను నాని లైన్ లో పెట్టాడు. అంటే..ఈ అరుదైన కాంబో సెట్ అవ్వడానికి.. కొంచెం టైమ్ అయితే పడుతుంది.
Latest News