by సూర్య | Sat, Sep 14, 2024, 06:47 PM
సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన హీరోగా నటిస్తున్న 'కూలీ' సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. బీచ్‌రోడ్‌లోని కంటైనర్ టెర్మినల్‌లో షూటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటిని అదుపు చేశారు. ఆ కంటైనర్ షిప్ ఈ నెల 28న చైనా నుంచి విశాఖపట్నం పోర్టుకు లిథియం బ్యాటరీలతో వచ్చినట్లు తెలుస్తోంది.
Latest News