150M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'శివం భజే'

by సూర్య | Sat, Sep 14, 2024, 03:13 PM

"హిడింబా"లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అశ్విన్ బాబు అప్సర్ దర్శకత్వం వహించిన "శివం భజే" అనే కొత్త యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మార్క్ సాధించలేకపోయింది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో  మరియు ఆహా ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాటుఫార్మ్స్ లో 150+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లోక్ చేసినట్లు మరియు టాప్ 6 మూవీస్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రం యొక్క ప్రత్యేకమైన కాన్సెప్ట్ కథానాయకుడి చుట్టూ తిరుగుతుంది. దిగంగన సూర్యవంశీ ఈ సినిమాలో అశ్విన్ కి జోడిగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, హైపర్ ఆది, అర్బాజ్ ఖాన్‌, మురళి శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ని మహేశ్వర రెడ్డి మూలి నిర్మించారు. వికాస్ బాడిసా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
బిగ్ బాస్ నుంచి కిర్రాక్ సీత అవుట్ Mon, Oct 14, 2024, 08:16 AM
టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌‌పై తాప్సీ ఆగ్రహం Sun, Oct 13, 2024, 09:17 PM
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM