బుక్ మై షోలో 'మత్తు వదలారా 2' జోరు

by సూర్య | Sat, Sep 14, 2024, 02:56 PM

శ్రీ సింహ కోడూరి మరియు సత్య ప్రధాన పాత్రలలో నటించిన "మత్తు వదలారా" సినిమా హిట్ గా నిలిచింది. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా సీక్వెల్‌తో తిరిగి వచ్చింది. ఒరిజినల్ స్టార్స్ శ్రీ సింహ కోడూరి మరియు సత్య నటించిన "మత్తు వదలారా 2" ట్విస్ట్‌లు, నవ్వులు మరియు హై-ఆక్టేన్ యాక్షన్‌తో నిండిన కొత్త సాహసంతో సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాకి బుక్ మై షోలో గత 24 గంటలకి 40.36K టికెట్స్ అమ్ముడయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి మరియు గుండు సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సారంగం మరియు ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ ఆర్ అందిస్తున్నారు. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 

Latest News
 
బిగ్ బాస్ నుంచి కిర్రాక్ సీత అవుట్ Mon, Oct 14, 2024, 08:16 AM
టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌‌పై తాప్సీ ఆగ్రహం Sun, Oct 13, 2024, 09:17 PM
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM