OTTలో 'కమిటీ కుర్రోళ్లు' సెన్సషనల్ రికార్డు

by సూర్య | Sat, Sep 14, 2024, 02:40 PM

నిహారిక కొణిదెల తొలి చలనచిత్ర నిర్మాణం 'కమిటీ కుర్రోళ్లు' ఆగష్టు 9, 2024న విడుదల అయ్యింది. ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరశురాజు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విశిక, మరియు షణ్ముకి నాగుమంత్రి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా విడుదలైన నాలుగవ రోజున బ్రేక్ ఈవెన్ ని చేరుకొని ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ చిన్న బడ్జెట్ చిత్రం 20 కోట్ల గ్రాస్ తో  ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసే లాంగ్ రన్‌లో అద్భుతంగా నడిచింది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా పరిశ్రమ తారల నుండి కూడా విస్తృతమైన ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. కమిటీ కుర్రోల్లు ఇప్పుడు ETV విన్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి, తెలుగు వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కోసం సిద్ధంగా ఉంది మరియు ఇతర వెర్షన్ల గురించి ఏమీ సమాచారం లేదు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫారంలో విడుదలైన తొలి రోజున 70,32,416 గ్రాస్ ని నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయాని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ వంశీ నందిపతి ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్‌ చేసారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. అనుదీప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌‌పై తాప్సీ ఆగ్రహం Sun, Oct 13, 2024, 09:17 PM
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM
'NBK 109' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Sat, Oct 12, 2024, 08:19 PM