రేపే 'మెకానిక్ రాకీ' సెకండ్ సింగల్ అనౌన్స్మెంట్

by సూర్య | Sat, Sep 14, 2024, 02:32 PM

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెకానిక్ రాకీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం అక్టోబరు 31, 2024న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మొదటి సింగిల్ మూవీ పై సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ అనౌన్స్మెంట్ ని రేపు ప్రకటించనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ మరియు రోడీస్ రఘు రామ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

Latest News
 
2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 'కోర్టు' ఎంత వాసులు చేసిందంటే...! Mon, Mar 17, 2025, 02:28 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' Mon, Mar 17, 2025, 02:21 PM
సుకుమార్ దర్శకత్వంలో నటించనున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ Mon, Mar 17, 2025, 02:19 PM
సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత Sun, Mar 16, 2025, 11:22 AM
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు Sun, Mar 16, 2025, 11:17 AM