దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ పిక్స్

by సూర్య | Sat, Sep 14, 2024, 12:17 PM

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాలను మాత్రమే లైన్లో పెడుతున్నాడు. త్రిపుల్ ఆర్ తర్వాత ఆయన నుంచి వస్తున్నా సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు..దేవర అనే టైటిల్ తో సినిమా మరి కొద్ది రోజుల్లో రాబోతుంది. టాలీవుడ్ మాస్ బ్రహ్మ కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. సెప్టెంబర్ 27 సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కేవలం రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ ను గట్టిగానే చేస్తున్నారు టీమ్.. మొన్న ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పుడు అందరి చూపు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై పైనే ఉంది..


దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను తాజాగా మేకర్స్ లాక్ చేశారు. ఈ నెల 22 న హైదారాబాద్ నిర్వహించనున్నారని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అఫిషియల్ గా ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా కొరటాలా ఎవరిని తీసుకురాబోతున్నారు అనే వార్త షికారు చేస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా చిరంజీవి రాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మహేష్ బాబు రావొచ్చుననే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరూ కాకుండా వేరే ఎవరైనా వస్తారేమో చూడాలి.. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం..


ఇక దేవర నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్నీ అప్డేట్స్ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించాయి. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేస్తుంది. ఆచార్య తో దెబ్బ తిన్న కొరటాల శివ ఈసారి భారీ హిట్ కొట్టి ఆచార్య మచ్చను మాపుకోవాలని చూస్తున్నారు. దేవర నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి.. ఇక బిజినెస్ ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. ఒక్క నైజాం హక్కులే అక్షరాల రూ.40 కోట్లకు అమ్ముడుపోయాయిట. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.150 కోట్లు-రూ.180 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరుగుతుంది.. ఇకపోతే ఈ సినిమాలో తారక్ తండ్రీ, కొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న మూవీ ‘దేవర’.దానికి తోడు ఆర్ఆర్ఆర్ వంటి అరివీర భయంకర హిట్టు తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక సినిమా ఎటువంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఈ మూవీ హిట్ అయితే కొరటాలకు కం బ్యాక్ అవుతుంది. ఏది ఏమైనా ఈ మూవీ రిజల్ట్ గురించి తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Latest News
 
బిగ్ బాస్ నుంచి కిర్రాక్ సీత అవుట్ Mon, Oct 14, 2024, 08:16 AM
టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌‌పై తాప్సీ ఆగ్రహం Sun, Oct 13, 2024, 09:17 PM
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM