ఆ క్రికెటర్ అంటే ఇష్టం .. అనన్య పాండే షాకింగ్ కామెంట్స్

by సూర్య | Sat, Sep 14, 2024, 11:32 AM

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సెలబ్రిటీ క్రష్ అని బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అన్నారు. కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని ఆమె చెప్పుకొచ్చారు.'కాల్ మీ బే' ప్రమోషన్లలో భాగంగా అనన్య ఈ వ్యాఖ్యలు చేశారు. 'కోహ్లీ గ్లోబల్ ఐకాన్. ఆయనలో ఏదో తెలియని శక్తి ఉంది. విరాట్లోని నాయకత్వ లక్షణాలు, జట్టును నడిపించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి' అని అనన్య పేర్కొన్నారు.కాగా, అనన్య పాండే తెలుగులో లైగర్ మూవీలో విజయదేవర కొండ సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీని దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించగా..బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఇక అప్పటినుంచి అనన్య తెలుగులో నేరుగా సినిమాలు చేయడం లేదు. బక్క పలుచని ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. కేవలం హిందీ సినిమాల మీదే తన ఫోకస్ పెట్టింది.


 


 

Latest News
 
బిగ్ బాస్ నుంచి కిర్రాక్ సీత అవుట్ Mon, Oct 14, 2024, 08:16 AM
టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌‌పై తాప్సీ ఆగ్రహం Sun, Oct 13, 2024, 09:17 PM
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM