1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సుందరకాండ' ఫస్ట్ సింగల్

by సూర్య | Fri, Sep 13, 2024, 07:36 PM

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ 20వ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ "సుందరకాండ" అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. సుందరకాండ హిందూ ఇతిహాసం రామాయణంలో ఐదవ పుస్తకం. ఈ చిత్రంలో రోహిత్ సరసన వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్ ఆమె తల్లిగా నటించారు. ఈ చిత్రంలో నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేయగా, టీజర్ మూవీ పై భారీ అంచులని నెలకొల్పింది. ఈ చిత్రం సామాజిక ఒత్తిడి మరియు అపహాస్యం ఎదుర్కొంటూ నిర్దిష్ట లక్షణాలతో భాగస్వామి కోసం వెతుకుతున్న ఒంటరి వ్యక్తి సిద్ధార్థ్‌ను అనుసరిస్తుంది. ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని బహుశా బహుశా అనే టైటిల్ తో విడుదల చేసారు. లియోన్ జేమ్స్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి శ్రీ హర్ష లిరిక్స్ అందించారు మరియు సిద్ శ్రీరామ్ తన గాత్రాన్ని అందించారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, రాజేష్ పెంటకోట ప్రొడక్షన్ డిజైనర్, రోహన్ చిల్లాలే ఎడిటర్ గా ఉన్నారు. ఈ చిత్రానికి  పృథ్వీ మాస్టర్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ, విశ్వ రఘు డ్యాన్స్ కొరియోగ్రఫీని నిర్వహించగా, నాగు తలారి VFX సూపర్‌వైజర్‌గా ఉన్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, ప్రదీష్ ఎమ్ వర్మ చిత్ర విజువల్స్‌ను సంగ్రహించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళ్ళ త్రయం ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'సారంగపాణి జాతకం' స్పెషల్ ప్రీమియర్ ఎప్పుడంటే...! Wed, Apr 23, 2025, 08:06 PM
ప్రముఖ షోలో నాని యొక్క 'హిట్ 3' ప్రమోషన్స్ Wed, Apr 23, 2025, 08:02 PM
జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం టి-సిరీస్ Wed, Apr 23, 2025, 07:55 PM
'సారంగపాణి జాతకం' గురించి ప్రియదర్శి ఏమన్నారంటే...! Wed, Apr 23, 2025, 07:50 PM
సూర్య - వెంకీ అట్లూరి చిత్రంలో కీర్తి సురేష్ Wed, Apr 23, 2025, 07:44 PM