by సూర్య | Fri, Sep 13, 2024, 07:25 PM
కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మెయ్యళగన్. ప్రేమ్ కుమార్.సీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే సినిమాను తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి తమిళ టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా తెలుగు టీజర్‌ను వదిలారు.
Latest News