విడుదల తేదీని లాక్ చేసిన 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం'

by సూర్య | Fri, Sep 13, 2024, 07:20 PM

లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు రావు రమేష్‌ నటించిన 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' సినిమా ఆగష్టు 23న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్ షోకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో రావు రమేష్ నటనకి భారీ రెస్పాన్స్ లభించింది.ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా వీడియో సొంతం చేసుకుంది. తాజాగా డిజిటల్ ప్లాట్ఫారం ఈ సినిమా సెప్టెంబర్ 20న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. పూర్తిగా వినోదభరితమైన కామెడీ-డ్రామాగా పేర్కొనబడిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేసారు.

Latest News
 
బిగ్ బాస్ నుంచి కిర్రాక్ సీత అవుట్ Mon, Oct 14, 2024, 08:16 AM
టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌‌పై తాప్సీ ఆగ్రహం Sun, Oct 13, 2024, 09:17 PM
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM