'వెట్టయన్' కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Thu, Sep 12, 2024, 07:20 PM

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టయాన్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ యాక్షన్ డ్రామాలో లెజెండరీ నటుడు పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ని సృష్టించింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క కేరళ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సాంకేతిక సిబ్బందిలో సినిమాటోగ్రాఫర్ SR కతిర్ I.S.C మరియు ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. సూపర్ కాప్ థ్రిల్లర్ తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, జిఎం సుందర్, రోహిణి, రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాని సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న 'ఖేల్ ఖేల్ మే' Thu, Oct 10, 2024, 04:43 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Thu, Oct 10, 2024, 04:39 PM
'వెట్టయన్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం Thu, Oct 10, 2024, 04:34 PM
'SSMB29' పై విజయేంద్ర ప్రసాద్ సంచలన అప్‌డేట్ Thu, Oct 10, 2024, 04:28 PM
నేడే 'జనక అయితే గనక' ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ Thu, Oct 10, 2024, 04:24 PM