'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Thu, Sep 12, 2024, 07:13 PM

హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్ మెంట్స్ ఉన్నప్పటికీ పెండింగ్ లో ఉన్న తన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మళ్లీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆంధ్రాలో వరదల కారణంగా పరిస్థితులు మారిపోయాయి. దాంతో పవన్ తన షూటింగ్స్ అన్నీ వాయిదా వేసుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ ఏడాది మళ్లీ ప్రారంభం కాబోదని, అందుకు చాలా సమయం పట్టవచ్చని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభం వరకు ఆగమని పవన్ మేకర్స్‌ని కోరినట్లు కూడా కొందరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రావడంపై భారీ అంచనాలు ఉన్నాయి మరియు ఉస్తాద్ భగత్ సింగ్ అతని కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా భావిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన "తేరి"కి రీమేక్ అయిన "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ 20% మాత్రమే పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల నటించింది. నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరధ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ ఇతరలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు.

Latest News
 
'ఆడుజీవితం' గ్రామీ నామినేషన్‌ను కోల్పోవటానికి కారణం వెల్లడించిన AR రెహమాన్ Thu, Oct 10, 2024, 05:23 PM
'బౌగెన్‌విల్లా' ట్రైలర్ అవుట్ Thu, Oct 10, 2024, 05:18 PM
'దేవర 2' షూటింగ్ ఈ సమయంలో ప్రారంభం కానుందా? Thu, Oct 10, 2024, 05:12 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'మా నాన్న సూపర్ హీరో' Thu, Oct 10, 2024, 05:05 PM
త్వరలో నిర్మాణాన్ని ప్రారంభించనున్న పా రంజిత్ యొక్క 'వెట్టువం' Thu, Oct 10, 2024, 04:59 PM