20M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కంగువ' ట్రైలర్

by సూర్య | Tue, Aug 13, 2024, 08:42 PM

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తన తదుపరి సినిమాని శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'కంగువ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో దిశా పాటని కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 24 గంటలలో 20 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ తో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. బాబీ డియోల్, యోగి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం  అందిస్తున్నారు. ప్రొడక్షన్‌ హౌస్‌ స్టూడియో గ్రీన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ యాక్షన్ డ్రామా అక్టోబర్ 10, 2024న విడుదల కానుంది.

Latest News
 
సూట్​లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ! Sun, Mar 23, 2025, 02:53 PM
నెగిటివ్ రోల్‌లో అల్లు అర్జున్ Sun, Mar 23, 2025, 02:33 PM
‘జాట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Mar 23, 2025, 02:27 PM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బాలకృష్ణ, ప్రభాస్‌, గోపిచంద్‌పై ఫిర్యాదు Sun, Mar 23, 2025, 12:32 PM
నా జర్నీలో వారంతా నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు Sun, Mar 23, 2025, 11:54 AM