శ్రీవారి సేవలో అల్లు స్నేహా రెడ్డి

by సూర్య | Tue, Aug 06, 2024, 07:05 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ సొంతంగా క్రేజ్ సొంతం చేసుకుంది స్నేహ.ముఖ్యంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంటుంది. తన ఇద్దరు పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ ల పెంపకంలో బిజీగా ఉంటోన్న స్నేహా రెడ్డి మంగళవారం (ఆగస్టు 06) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయాన్, అర్హలతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి స్వామి వారికి మొక్కులు చెల్లించారు స్నేహా రెడ్డి. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్నేహారెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకు ముందు అల్లు స్నేహ తన కుటుంబ సభ్యులతో కలిసి కాలి నడకన తిరుమలకు చేరుకుంది. మెట్ల మార్గంలో తీసుకున్న కొన్ని ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసుకుంది బన్నీ సతీమణి. ఇక స్వామివారి దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చాక అల్లు స్నేహ మీ మీడియా ముందుకు వచ్చినా ఏమి మాట్లాడుకుండానే వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో స్నేహా రెడ్డి తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Latest News
 
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM
ఈ నెల 27న విడుదల కానున్న స‌త్యం సుంద‌రం Wed, Sep 18, 2024, 05:50 PM
అక్టోబర్ 31న విడుదల కానున్న అమ‌ర‌న్ Wed, Sep 18, 2024, 05:48 PM
'మ్యాడ్' కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్‌' Wed, Sep 18, 2024, 05:47 PM