by సూర్య | Mon, Aug 05, 2024, 08:21 PM
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలను రీ-రిలీజ్ చేయగా, అవి బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆగస్టు 9న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ”మురారి” 4కె వర్షన్ ను రీ-రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త ట్రెండ్ అవుతూ వస్తోంది. ఈ సినిమా రీ-రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-సేల్స్ రూ.కోటి దాటిందని మేకర్స్ చెబుతున్నారు.
ఇలా ఓ రీ-రిలీజ్ సినిమా అత్యంత వేగంగా రూ.కోటి వసూళ్లు రాబట్టడంతో మురారి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇదిలాగే కొనసాగితే, ఈ సినిమా త్వరలోనే రూ.2కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయమని సినీ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా, దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Latest News