ప్రభాస్ తదుపరి చిత్రంలో పాకిస్థానీ బ్యూటీ

by సూర్య | Mon, Jul 22, 2024, 05:22 PM

సీతా రామ ఫేమ్ హను రాఘవపూడితో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఫౌజీ అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పాకిస్థాన్ నటి సజల్ అలీ నటిస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. దివంగత నటి శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో సజల్ అలీ తన పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. సీతా రామం చిత్రానికి హిట్ మ్యూజిక్ కంపోజ్ చేసిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఇట్స్ కంప్లికేటేడ్' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Feb 08, 2025, 08:47 PM
లెహంగాలో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న కృతి శెట్టి Sat, Feb 08, 2025, 08:02 PM
త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా : కన్నడ నటుడు దర్శన్‌ Sat, Feb 08, 2025, 07:37 PM
'అఖండ 2' ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా? Sat, Feb 08, 2025, 06:49 PM
'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Sat, Feb 08, 2025, 06:43 PM