YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగల్

by సూర్య | Mon, Jul 22, 2024, 05:12 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని మార్ ముంత చోడ్ చింత అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ లో గత నాలుగు రోజులుగా ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది.

Latest News
 
రామ్ చరణ్ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆర్.రెహ్మాన్ “Peddi” సంగీతంతో హిట్ సెట్! Sat, Nov 08, 2025, 11:42 PM
“SSMB 29: మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం ప్రత్యేక సందేశం!” Sat, Nov 08, 2025, 11:27 PM
“కింగ్: భారతదేశంలోనే అత్యంత ఖరీదైన యాక్షన్ మూవీ!” Sat, Nov 08, 2025, 11:02 PM
తెలుగు మూవీ, OTT డ్యూటీ: రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు Sat, Nov 08, 2025, 10:23 PM
మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తా - హీరోయిన్ కామాక్షి భాస్కరాల Sat, Nov 08, 2025, 07:50 PM