'అలనాటి రామచంద్రుడు' ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్

by సూర్య | Mon, Jul 22, 2024, 04:57 PM

చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో అలనాటి రామచంద్రుడు సినిమాతో కృష్ణవంశీ తెలుగు ఇండస్ట్రీలో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మోక్ష కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్ ని వెల్లడించారు. చిత్ర బృందం జులై 23న విజయవాడ, గుంటూరు వెళ్లనుండగా, జులై 24న రాజమండ్రి, కాకినాడ వెళ్లనుంది ఆ తర్వాత జులై 25న వైజాగ్ తో ఈ ప్రమోషనల్ టూర్ ని ముగించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోధిని, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి కూడా కీలక పాత్రలో నటించారు. శశాంక్ తిరుపతి స్వరాలు సమకూర్చగా, ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ప్రేమకథని హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు.

Latest News
 
మరోసారి చిక్కుల్లో పడ్డ నటుడు టామ్ చాకో Thu, Apr 17, 2025, 07:04 PM
రేపే 'థగ్ లైఫ్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 17, 2025, 06:54 PM
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా? Thu, Apr 17, 2025, 06:50 PM
'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Apr 17, 2025, 06:42 PM
'ఎల్ 2: ఎంప్యూరాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 17, 2025, 06:38 PM