కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'దేవా'

by సూర్య | Fri, Jul 19, 2024, 04:54 PM

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియాలో చివరిగా కనిపించాడు. తాజాగా ఇప్పుడు కాప్ యాక్షన్ డ్రామా 'దేవా' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, దేవా సినిమా ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించిన ఈ చిత్రంలో పావైల్ గులాటి మరియు కుబ్రా సైత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Latest News
 
'సారంగపాణి జాతకం' స్పెషల్ ప్రీమియర్ ఎప్పుడంటే...! Wed, Apr 23, 2025, 08:06 PM
ప్రముఖ షోలో నాని యొక్క 'హిట్ 3' ప్రమోషన్స్ Wed, Apr 23, 2025, 08:02 PM
జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం టి-సిరీస్ Wed, Apr 23, 2025, 07:55 PM
'సారంగపాణి జాతకం' గురించి ప్రియదర్శి ఏమన్నారంటే...! Wed, Apr 23, 2025, 07:50 PM
సూర్య - వెంకీ అట్లూరి చిత్రంలో కీర్తి సురేష్ Wed, Apr 23, 2025, 07:44 PM