50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మహారాజా'

by సూర్య | Thu, Jul 18, 2024, 05:25 PM

నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో జులై 12, 2024న  ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా 50 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
మరోసారి చిక్కుల్లో పడ్డ నటుడు టామ్ చాకో Thu, Apr 17, 2025, 07:04 PM
రేపే 'థగ్ లైఫ్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 17, 2025, 06:54 PM
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా? Thu, Apr 17, 2025, 06:50 PM
'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Apr 17, 2025, 06:42 PM
'ఎల్ 2: ఎంప్యూరాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 17, 2025, 06:38 PM