ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్

by సూర్య | Sat, Jul 13, 2024, 05:41 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ దర్శకుడు వస్సిష్ట మల్లిడితో కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ బెంగుళూరులో ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్లు ఆన్లైన్ లో ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో సురభి, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, ఆషిక రంగనాథ్, కునాల్ కపూర్ మరియు అశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రలలో కనిపించనున్నారు. రచయిత-నటుడు నుండి దర్శకుడిగా మారిన హర్ష వర్ధన్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఫాంటసీ డ్రామా జనవరి 10, 2025న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేస్తున్నారు.

Latest News
 
వృద్ధాశ్రమంలో పాకీజా, ఆదుకోవాలని వేడుక Sat, Dec 13, 2025, 11:36 AM
చైతూతో వైవాహిక జీవితంపై శోభితా ఎమోషనల్ Sat, Dec 13, 2025, 10:48 AM
ట్రోల్స్ నాకు ఎనర్జీ ఇచ్చాయి: ప్రభాస్ సినిమాపై దర్శకుడు మారుతి Sat, Dec 13, 2025, 10:47 AM
‘నరసింహ’ చిత్రానికి సీక్వెల్‌ వస్తదంటున్న రజనీకాంత్ Sat, Dec 13, 2025, 10:15 AM
హిందీ బిగ్‌బాస్ లో విజేతగా నిలిచిన గౌరవ్ ఖన్నా Sat, Dec 13, 2025, 10:14 AM