'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా?

by సూర్య | Tue, Apr 23, 2024, 07:33 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 యొక్క పవర్-ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేసారు. టీజర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది.


లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలోని మొదటి సింగిల్ మే మొదటి వారంలో విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తునట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు.

ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
SMB 29: ఈసారి వెయిట్ లేదు, Globetrotter విడుదల డేట్ బయటపెట్టారు Sat, Nov 15, 2025, 10:53 PM
Varanasi Movie: మహేశ్ స్టైలిష్ స్పెషల్ క్లిప్ వచ్చేసింది! Sat, Nov 15, 2025, 10:18 PM
రాజమౌళి స్పెషల్ అప్‌డేట్: గ్లోబ్ ట్రాటర్ టైటిల్ & గ్లింప్స్ రెడీ! Sat, Nov 15, 2025, 08:24 PM
మహేష్‌బాబు సినిమా టైటిల్ రిలీజ్‌.. అభిమానుల్లో జోష్ Sat, Nov 15, 2025, 07:30 PM
మాస్ జాతర.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్! Sat, Nov 15, 2025, 04:41 PM