ప్రియాంక చోప్రాకి ఆ యాప్‌తో ఏమి అవసరం?: సల్మాన్ ఖాన్

by సూర్య | Fri, Mar 22, 2019, 03:36 PM

ఒక్కసారి తనకి ఎదురు వెళితే వారిపై చాలా కాలం పగ పడతాడని సల్మాన్‌ ఖాన్‌కి పేరుంది. భాయ్‌ కోపానికి గురయిన చాలా మందికి ఇంతవరకు అతని కటాక్షం లభించలేదు. అతడిని ప్రసన్నం చేసుకోవడానికి పబ్లిగ్గా సారీ చెప్పినా కానీ సల్మాన్‌ కనికరించడు. భరత్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయిన ప్రియాంక చోప్రా చెప్పా పెట్టకుండా ఆ సినిమా వదిలేసుకోవడం సల్మాన్‌కి అవమానకరంగా అనిపించింది. పెళ్లి కోసమని ఈ చిత్రం వదిలేసుకున్న ప్రియాంకపై భాయ్‌ కోపంగా వున్నాడని అప్పట్నుంచీ మీడియాలో వస్తూనే వుంది. ఆమె స్థానంలో కత్రినా కైఫ్‌ని తీసుకున్నా ఇంకా ప్రియాంకపై సల్మాన్‌కి కోపం తీరినట్టు లేదు. ఇటీవల ఆమె ఒక డేటింగ్‌ యాప్‌ని ఇండియాలో లాంఛ్‌ చేసింది.

ఆ యాప్‌ ప్రత్యేకత ఏమిటంటే ముందుగా ఆడవాళ్లే అబ్బాయిలని కాంటాక్ట్‌ చేస్తారు. డేటింగ్‌ యాప్స్‌పై తన స్పందన మీడియాతో చెబుతోన్న సల్మాన్‌ తన ఫోన్‌లో అలాంటి యాప్స్‌ వుండవని అన్నాడు. మరి ప్రియాంక లాంఛ్‌ చేసిన యాప్‌పై మీ అభిప్రాయం ఏమిటని అడిగితే, అదేమిటో తనకి తెలియదని చెబుతూనే ''అయినా ఇప్పుడు ఆమెకి ఆ యాప్‌తో ఏమి అవసరం?'' అంటూ సెటైర్‌ వేసాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ప్రియాంకకి డేటింగ్‌ యాప్‌ లాంఛ్‌ చేయాల్సిన అవసరమేంటనేది సల్మాన్‌ ఉద్దేశం. సల్మాన్‌ వేసిన సెటైర్‌ బాగా పేలడమే కాకుండా ప్రియాంక ట్రోలింగ్‌కి కూడా దారి తీసింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM