సమంత చెప్పిన విషయానికి నాగచైతన్య షాక్ తిన్నాడట..!

by సూర్య | Fri, Mar 22, 2019, 12:15 PM

సమంత అక్కినేని టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో టాప్ ప్లేస్ ను ఎంజాయ్ చేస్తుంది. అటు నాగచైతన్యతో పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియా తో ఎప్పుడూ అభిమానులతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఈ మధ్య కొంచెం తన  హాట్ ఫోటోలను అప్ లోడ్ చేసి ట్రోలింగ్ కి కూడా గురైంది. అయితే ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు చేయడం చైతూకు నచ్చడం లేదు అని ఆమె చెప్పింది. ఈ విషయంలో తనపై కోపంగా ఏమీ చైతూ లేడని, తనకు నచ్చిందే తాను చేస్తున్నానని, ఇతరుల అభిప్రాయాలను, విమర్శలను లెక్కచేయబోనని తెలిపింది. 

తన అప్ కమింగ్ సినిమా  'సూపర్ డీలక్స్' సినిమా  విడుదలకు సిద్ధం కాగా, ప్రమోషన్ నిమిత్తం చెన్నైకి వచ్చిన సమంత మీడియాతో మాట్లాడింది. ఈ సినిమాలో తనది వ్యాంప్ పాత్రని, దీని గురించి చైతూకు చెప్పగానే షాక్ అయ్యాడని, కానీ, తనకు కథ నచ్చడంతో అంగీకరించానని వెల్లడించింది. 'కెప్టెన్ మార్వెల్' వంటి సూపర్ ఉమెన్ స్టోరీతో ఎవరైనా తనను సంప్రదిస్తే, కచ్చితంగా నటిస్తానని వెల్లడించింది. కాగా, తెలుగులో 'ఓ  బేబీ' చిత్రంలో నటిస్తున్న సమంత, ఇది వినోద భరిత చిత్రమని, ఆది నుంచి చివరి వరకూ నవ్వుకునేలా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చింది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM