ఎన్నికల్లో పోటీచేసే ఆలోచ‌న లేదు ! హీరో స‌ల్మాన్‌

by సూర్య | Thu, Mar 21, 2019, 07:59 PM

సల్మాన్‌ ఖాన్‌ను ఇండోర్‌లో ప్రచారం చేసేందుకు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్న వార్తలతో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇండోర్‌లో సల్మాన్‌తో ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఆయన కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేయడం దాదాపు ఖాయమని ఆ పార్టీ ప్రతినిధి పంకజ్‌ చతుర్వేది పేర్కొన్నారు. సల్మాన్‌ ఖాన్‌ ఇండోర్‌లో జన్మించడంతో ఇక్కడ ప్రచారం చేసేందుకు అంగీకరిస్తారని, ఆయన ప్రచారంతో తమ పార్టీ గెలుపు సులభసాధ్యమవుతుందని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకొచ్చారు. కాగా బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఇండోర్‌లో జన్మించడం గమనార్హం. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని, ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయాలనే ఉద్దేశం కూడా లేదని బాలీవుడ్‌ కండలవీరుడు స‌ల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ పోటీ చేస్తారని సాగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM