విజయ్ దేవరకొండ అంటే మరీ ఇంత పిచ్చి ఏంటి బాస్ !

by సూర్య | Thu, Mar 21, 2019, 03:04 PM

విజయ్ దేవరకొండ ఇప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారి టాప్ గేర్ లోకి వచ్చాడు. ఆ సినిమాతో చాల మంది యువతను తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత వరుసగా యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇదే సమయంలో తాను 'రౌడీ ' బ్రాండ్ ఓపెన్ చేసాడు. అది కూడా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఎంతలా అంటే ఏకంగా తమ వాహనాలపై రౌడీ అని రాయించుకోవడం మొదలుపెట్టారు. ఇదే వారికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. రౌడీ అని అత్యధిక సంఖ్యలో విజయ్ ఫ్యాన్స్ నెంబర్ ప్లేట్స్ పై ముద్రించుకోవడంతో ట్రాఫిక్ పోలీసులు లాఠీ ఝులిపించడం మొదలుపెట్టారు. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ పై రౌడీ సింబల్ వున్న ఓ టూవీలర్ ని పట్టుకుని జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది. ఇలా నెంబర్ ప్లేట్లపై రౌడీ సింబల్ వేసుకోవడం చట్టవిరుద్ధమని ఆగ్రహించిన ట్రాఫిక్ పోలీసులు ఫేస్ బుక్ లో పలువురికి హెచ్చరికలు జారీ చేశారు.

తాజాగా విజయ్ దేవరకొండ  ఈ పోస్ట్ పై స్పందిన్చాడు . తన కారణంగా ఇబ్బింది ఎదురైంది కాబట్టి వారి తరుపున తాను క్షమాపణ చెబుతున్నట్టు విజయ్ దేవరకొండ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు రిప్లై ఇచ్చాడు. అలాగే అభిమానులని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు `మీరంతా నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. మిమ్మల్ని నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను. నా వల్ల మీరు కష్టల్లో ఇరుక్కోవద్దు. కొన్ని రూల్స్ మనం తప్పకుండా పాటించాలి. అవన్నీ మన మంచి కోసం పెట్టినవే. మీ ప్రేమను ఎలాగైనా చూపించండి. కానీ నెంబర్ ప్లేట్స్ పై మాత్రం బండి నెంబర్లనే వుంచండి` అని పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.     

Latest News
 
'అరణ్మనై 4' UK అండ్ యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:00 PM
ఇన్‌స్టాగ్రామ్ సమస్య పై స్పందించిన యువన్ శంకర్ రాజా Fri, Apr 19, 2024, 05:38 PM
'VD12' లో మమిత బైజు Fri, Apr 19, 2024, 05:35 PM
'డియర్' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్ Fri, Apr 19, 2024, 05:32 PM
'భగవంత్ కేసరి' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 05:26 PM