శ్రీవిష్ణు కొత్త సినిమా ఫస్టులుక్ విడుదల

by సూర్య | Thu, Mar 21, 2019, 02:01 PM

మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలను .. విలక్షమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అందువల్లనే ఆయనకి యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా 'బ్రోచేవారెవరురా' రూపొందుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శ్రీవిష్ణు సరసన నాయికలుగా నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ నటిస్తున్నారు.

ఈ రోజున 'హోలీ' పండుగ కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను వదిలారు. శ్రీవిష్ణు .. రాహుల్ రామకృష్ణ .. ప్రియదర్శి పాత స్కూటర్ పై ప్రయాణం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. స్నేహాం .. ప్రేమ నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. టైటిల్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా,  టీజర్ .. ట్రైలర్లతో మరింతగా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

Latest News
 
ఫ్యామిలీ స్టార్ : నంద నందనా వీడియో సాంగ్ అవుట్ Tue, Apr 23, 2024, 06:40 PM
'హరోమ్ హర' లోని కనులెందుకో సాంగ్ ప్రోమో అవుట్ Tue, Apr 23, 2024, 06:38 PM
TFDA సంక్షేమానికి 35 లక్షలు విరాళంగా ఇచ్చిన ప్రభాస్ Tue, Apr 23, 2024, 06:35 PM
OTT : విడుదల తేదీని లాక్ చేసిన 'నయట్టు' తెలుగు వెర్షన్ Tue, Apr 23, 2024, 06:30 PM
తన తొలి కన్నడ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఐశ్వర్య రాజేష్ Tue, Apr 23, 2024, 06:20 PM