ఇళయదళపతి 63 శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకున్న సన్ టీవీ

by సూర్య | Wed, Mar 20, 2019, 04:52 PM

తమిళనాడులో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరంటే పక్క అందరు 'విజయ్ ' అనే చెప్తారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కోలీవుడ్ లో  ప్రస్తుతం టాప్ స్థానంలో ఉన్న హీరో అనే చెప్పాలి. విజయ్ నటిస్తున్న తలపతి 63 షూటింగ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఇందులో హీరోయిన్ గా నయనతార నటిస్తుంది.  ఇక ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ సన్ టీవీ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే డిజిటల్ రైట్స్ ను మాత్రం ఇంకా ఎవరికి ఇవ్వలేదు. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం యొక్క శాటిలైట్ , డిజిటల్ రైట్స్ విలువ 6 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కోలీవుడ్ లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ డీల్. ఇక అట్లీ -విజయ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘తెరి ,మెర్సల్’ చిత్రాలు మంచి విజయాలు సాధించడం తో ఈ మూడవ సినిమా ఫై భారీ అంచనాలు వున్నాయి.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM