'ఆర్ఆర్ఆర్' కోసం అభిమానులు పంపించిన పేర్లు ఇవే !

by సూర్య | Wed, Mar 20, 2019, 12:45 PM

బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న మరో చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా తెరెకెక్కిస్తున్నాడు మన జక్కన్న. రీసెంటుగా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమాకు సంబందించిన కథను పూర్తిగా చెప్పాడు. అలాగే ఈ సినిమా టైటిల్ 'ఆర్ ఆర్ ఆర్' కు టైటిల్ కు పేరు పెట్టే బాధ్యతను అభిమానులపై ఉంచారు రాజమౌళి.

ఇలా చెప్పడం ఆలస్యం ఈ సినిమాకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోటి చొప్పున్న ఈ సినిమాకు తగిన టైటిల్స్ పంపిస్తున్నారు.  వీటిల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. 'రఘుపతి రాఘవ రాజారాం', 'రం రం రుథిరం', 'రామ రావణ రాజ్యం', 'రౌద్ర రణ రంగం' ఇలా ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. వీటిల్లో కొన్నింటిని రాజమౌళి సైతం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ కి జోడిగా  అలియా భట్ ,ఎన్టీఆర్ కి జోడిగా డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ పాత్రలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM