రష్మీ గౌతమ్ కి ఆక్సిడెంట్ తెచ్చిన తలనొప్పి...

by సూర్య | Mon, Mar 18, 2019, 04:35 PM

బుల్లితెరను తనదైన స్టయిల్లో అందంగా నడిపిస్తున్న యాంకర్ రష్మీ. జబర్ధస్త్ యాంకర్ గా చాలానే పేరు తెచ్చుకుంది. అడపాదడపా కొన్ని సినిమాల్లో నటిస్తూ ,ఇటు హీరోయిన్ గా అటు యాంకర్ గా రెండు చేతులా సంపాదిస్తుంది.

దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి అన్నట్లుగా రష్మీ అక్కడక్కడా కొన్నిషాప్ ఓపెనింగ్స్ కి వెళుతూ ఆ విధంగా కూడా సంపాదిస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇటీవలే రష్మి ఓ కొత్త కారు కొనుక్కున్నారట. ఆ కార్ లో విశాఖపట్నం జిల్లా గాజువాక కూర్మన్నపాలెం రోడ్ లో వెళుతున్నారు. అయితే ఓ జంక్షన్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని రష్మి కారు ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి 11 గం.ల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 


ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారట స్థానికులు.  ఆ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM