అక్క చెల్లెల్లు ఆకాశం నుండి దిగి వచ్చారా అన్నట్లుంది

by సూర్య | Mon, Mar 18, 2019, 04:11 PM


ఈ సోషల్ మీడియా వల్ల ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది. ఎక్కడ ఏది జరిగిన యిట్టె క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక సామజిక మాధ్యమాల్లో ఫోటోల గురించి చెప్పనక్కర్లేదు. ఎవరైనా సరే ఫోటో దిగి వెంటాడే అప్లోడ్ చేస్తారు.  


ఐతే సెలెబ్రెటీల విషయంలో మాత్రం ఇది కాస్త ఎక్కువగానే ఉంటాయి. వారు ఏం చేస్తున్నారో ,ఎక్కడికెళ్తున్నారో , ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో అని చాలా మంది ఓ కన్ను వేసే ఉంటారు. రీసెంట్ గా హలో మ్యాగజైన్ వారు అవార్డు ఫంక్షన్ నిర్వహించారు.  ఆ ఈవెంట్ కు ఇద్దరు కపూర్లు హాజరయ్యారు.. ఒకరు సోనం కపూర్ అహూజా.. మరొకరు జాన్వీ కపూర్ఊరికే స్టైల్ గా తమ డ్రెస్ చూపించుకోవడానికి హాజరు కాలేదు సోనమ్.. జాన్వి.


 సోనమ్ కు 'ట్రెయిల్ బ్లేజర్ పెర్ఫామర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రదానం చేయగా జాన్వికి 'బెస్ట్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్' అనే అవార్డును ఇచ్చారు.  ఈ అవార్డులను స్వీకరించడానికి హాజరయ్యారు. అవార్డులు స్వీకరించడమే కాదు ఇద్దరూ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.  ఒక ఫోటో ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి 'నా డేట్ తో లాస్ట్ నైట్. జాన్వికి బెస్ట్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్.. నాకు ట్రెయిల్ బ్లేజర్ పెర్ఫామర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ఇచ్చినందుకు హలో మ్యాగజైన్ ఇండియా వారికి కృతజ్ఞతలు.  మనం నమ్మిన దానికి అవార్డులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 




ఇద్దరూ అక్క చెల్లెళ్ళు(బోనీ కపూర్ కూతురు.. అనిల్ కపూర్ డాటరు) ఇచ్చిన పోజు నెటిజనులను ఎంతో ఆకర్షిస్తోంది.  మూడు గంటలలోనే రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఆశలు ఈ  ఫోటోలో ఆకుపచ్చ రంగుతో పాటు పింక్ కలర్ కూడా కలిసిన ఒక స్లీవ్ లెస్ లాంగ్ గౌయిన్ లో దర్శనమిచ్చింది. డీప్ నెక్ తో క్లీవేజ్ షో కూడా చేసేసింది. మరోవైపు జూనియర్ అతిలోక సుందరి జాన్వి బూడిద రంగు థై-స్లిట్ గౌన్ లో తళుక్కున మెరిసింది. 


Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM