పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మెగా కూతురు

by సూర్య | Sun, Mar 17, 2019, 04:23 PM

పవన్ కళ్యాణ్ స్థాపించిన  జనసేన పార్టీకి నిహారిక  ప్రచారం మొదలేట్టేసింది. బాబాయికి ఓటు వేయండి అంటూ అభిమానులను కోరుతుంది.  నిహారిక నటించిన తాజా సినిమా ‘సూర్యకాంతం’ ఈ నెల 23న విడులవుతుంది.  ప్రస్తుతం చిత్ర యూనిట్  ప్రమోషనల్ పనులను జోరుగా కొనసాగుతున్నది. ప్రణీత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా  ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా ఓ వేడుకలో నిహారికకి పవన్ అభిమానుల నుండి జై పవర్ స్టార్, జై జనసేన అంటూ నినాదాలు ఎదురయ్యాయి.

దాంతో వారిని మరింత ఉత్సాహపరచడానికి మెగా డాటర్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను హుషారేత్తించాయి. ‘పవన్ కళ్యాణ్ అసలు పేరు మీకు తెలుసా.. కొణిదెల కళ్యాణ్ కుమార్.. ఆయన మా నాన్నకు తమ్ముడు.. చిరంజీవికి తమ్ముడు, నాకు బాబాయి” అంటూ మొదలుపెట్టిన నీహారిక.. పవన్ ప్రస్తుతం జనసేన పార్టీ ప్రచారంలో బిజీగా ఉన్నారని, తనకు ఆంధ్రలో ఓటు లేదు కాబట్టి.. మీరందరూ జనసేన పార్టీకి ఓటు వేయాలంటూ అభిమానులను కోరింది.

త్వరలోనే తాను కూడా ప్రచారంలో పాల్గొంటాని తెలిపింది. అలాగే జనసేన పార్టీ సింబల్ గ్లాస్ తో మంచి మొమొరీ ఉందని చెప్పిన నిహారిక.. ఆ ఫోటోని ఎన్నికల ముందు షేర్ చేస్తానని చెప్పుకొచ్చింది. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు సైతం జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా బాబాయి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇలా మెగా ఫ్యామిలీ జనసేనానికి అండగా తమవంతు సాయం చేస్తోంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM