సినిమా కోసం పడిన కష్టాన్ని మర్చిపోయాం : బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ టీం

by సూర్య | Sun, Mar 17, 2019, 04:02 PM

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్' ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు.


ఈ సందర్భంగా నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ మాట్లాడుతూ .. . విడుదలైన అన్ని కేంద్రాల నుంచి మా చిత్రా నికి మంచి స్పందన వస్తోంది. తొలి చిత్రమే విజయం దక్కడం నిర్మాతగా మరిన్ని సినిమాలు చేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. అన్నారు.


దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ…విడుదల రోజు తొలి ఆట చూస్తున్నప్పుడు ఇన్నాళ్ల పాటు సినిమా కోసం పడిన కష్టాన్ని మర్చిపోయాం. అంత గొప్ప విజయాన్ని ప్రేక్షకులు అందించారు. సినిమా బాగుంటే కొత్త నటులు, పాత వాళ్లు అనే బేధం చూడరని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. అన్నారు.


గోరటి వెంకన్న మాట్లాడుతూ…సినిమా బాగుందన్న స్పందన వస్తోంది. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో హింస లేదు, అశ్లీలత లేదు, ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు. కుటుంబమంతా హాయిగా చూసి ఆనందించవచ్చు అన్నారు.

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM