కార్నివ‌ల్ ఫెస్టివ‌ల్ శ్రియ డ్యాన్స్....వాచ్ వీడియో

by సూర్య | Sun, Mar 17, 2019, 01:20 PM

ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన  శ్రియకు నాగార్జున హీరోగా నటించిన 'సంతోషం' మూవీతో సుడి తిరిగింది. సినీ కెరియ‌ర్ లో స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించిన  శ్రియ‌.ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు వ‌యస్సు 36 ఏళ్ళు కాగా, ఇక ఆఫ‌ర్లు రావ‌డమే క‌ష్ట‌మ‌ని అంద‌రు అనుకున్నారు. కాని అంద‌రి అంచ‌నాలు మించేలా హీరోయిన్ పాత్ర‌ల‌తో పాటు కీల‌కమైన రోల్స్ చేస్తుంది. శ్రియ న‌టించిన న‌ర‌కాసురుడు చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, త‌మిళంలో న‌ర‌గ‌సూర‌న్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రిలీజ్‌కి సిద్దంగా ఉంది.


చివ‌రిగా శ్రియ న‌టించిన న‌క్ష‌త్రం, పైసా వ‌సూల్‌, గాయ‌త్రి, వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. ఎన్టీఆర్ క‌థానాయకుడు చిత్రంలో కామియో రోల్ పోషించిన‌, పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి కిట్టిలో ప‌లు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే తాజాగా ఈ అమ్మ‌డు న‌డిరోడ్డుపై నృత్యం చేసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. విదేశాల‌లో ప్ర‌స్తుతం కార్నివ‌ల్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతుండ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో భాగంగా శ్రియ స్టెప్పులేసింది. ప్ర‌స్తుతం శ్రియ డ్యాన్స్ వీడియో వైర‌ల్ అయింది. 





Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM