పాటల పూదోట -సిరివెన్నెలకు పద్మశ్రీ

by సూర్య | Sat, Mar 16, 2019, 09:19 PM

ప‌దాలతో ప్రయోగాలు చేయ‌గ‌ల స‌మ‌ర్ధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ రోజు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రామ్‌నాద్ కోవింద్ చేతుల మీదుగా ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్నారు. రాష్టపతి భవన్ లో పద్మ శ్రీ అవార్దుల ప్రదానం జరిగింది. అవార్డ్ స్వీకరించిన అనంతరం సిరివెన్నల గారు మాట్లాడుతూ..నా సాహితీ వ్యవసాయానికి అందిన ఫలసాయం పద్మశ్రీ అని అన్నారు. సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువ ప్రేమిస్తాన‌ని, సినిమా సమాజానికి అద్దం లాంటిది. సినిమాల వల్ల సమాజం ఎపుడూ చెడిపోదని అన్నారు. సిరివెన్నెల కు పద్మ శ్రీ రావడం పట్ల తెలుగు ప్రజలు గర్వంగా ఫీల్ అవుతున్నా న‌ని తెలిపారు. సినిమా రంగానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి చేసిన, చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. అతనో తెలుగు సినిమా పాటల పూదోటలో విరిసిన పారిజాతపుష్పం అని ఎందరో అతన్ని కీర్తించిన విషయం సుపరిచితమే.  సిరివెన్నెల గారు 1955 మే 20న విశాఖపట్నం, అనకాపల్లిలో జ‌న్మించారు. ఇతడు మొదట టెలిఫోన్ డిపార్ట్ మెంట్ లో సాధారణ ఉద్యోగిగా ఉంటూనే పద్యాలు, గేయాలు రాసేవాడు. ‘సిరివెన్నెల’సినిమా తో వెండి తెరకు పరిచయమై అదే సినిమా కు నంది అవార్డ్ ని సైతం దక్కించుకున్న విషయం తెలిసిందే.  

Latest News
 
'హరోమ్ హర' సెకండ్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 23, 2024, 03:56 PM
'కృష్ణ ఫ్రొం బృందావనం' షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..! Tue, Apr 23, 2024, 03:52 PM
'ప్రతినిధి 2' ని USAలో విడుదల చేస్తున్న ప్రముఖ బ్యానర్ Tue, Apr 23, 2024, 03:45 PM
తెలుగులో 'నాయట్టు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Tue, Apr 23, 2024, 03:39 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కూలీ' టైటిల్ టీజర్ Tue, Apr 23, 2024, 03:37 PM