స్వర్గంలో వైఫై ఫ్రీగా పెట్టారు : పృథ్వీరాజ్

by సూర్య | Sat, Mar 16, 2019, 06:16 PM

తెలుగు .. తమిళ భాషల్లో నటుడిగా ఎన్నో విభిన్నమైన .. విలక్షమైన పాత్రలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పృథ్వీరాజ్ సంపాదించుకున్నారు.  అయితే ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన పూర్తి విషయాన్ని చూపించకుండా ‘అవును నేను సూసైడ్ చేసుకున్నా’ అన్న మాటను మాత్రం చూపించారట. ఇంకేముంది పోలీసులు కూడా వచ్చి తన ఇంటి తలుపు తట్టారట. ఈ విషయాన్ని ఆయన ఓ టీవీ షోలో గుర్తు చేసుకున్నారు.

‘‘ఒక తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను చెప్పిన కథ మొత్తం చూపించకుండా ‘అవును సూసైడ్‌ చేసుకున్నా’ అన్న మాట మాత్రమే టీవీలో చూపించారు. దాంతో ఈ వార్తలు మరిన్ని పెరిగాయి. అసలు ఏం జరిగిందంటే.. సూసైడ్‌పై నేను ఒక షార్ట్‌ ఫిలిం చేశా. అది చూసి నిజంగా నేను సూసైడ్‌ చేసుకున్నానని.. ఏకంగా పోలీసులు కూడా ఇంటికి వచ్చారు. నాకూ, ఇంటికీ అందరూ ఒకటే ఫోన్లు. మలేషియా నుంచి కూడా ఒకమ్మాయి ఫోన్‌ చేసింది. ‘సర్‌ మీరు సూసైడ్‌ చేసుకున్నారా’ అనడిగితే అవునమ్మా అన్నా. ‘సర్‌ దయ చేసి ఆత్మహత్య చేసుకోవద్దు’ అని చెబుతూ.. ‘అవునూ, మీరు సూసైడ్‌ చేసుకుంటే ఎలా మాట్లాడుతున్నారు’ అని ఆశ్చర్యపోయింది. ఇక్కడ స్వర్గంలో వైఫై ఫ్రీగా పెట్టారు అనేసరికి ఠక్కున ఫోన్‌ పెట్టేసింది’’ అని తెలిపారు.  

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM