మూడు సినిమాలతో వస్తున్న సమంత

by సూర్య | Sat, Mar 16, 2019, 03:18 PM

సౌత్ సినిమాలో టాప్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న సమంత.. ఆ తరవాత అక్కినేనివారి కోడలు అనే హోదాను తెచ్చుకున్నారు. నాగ చైతన్యను పెళ్లిచేసుకున్నప్పటికీ తన ప్రొఫెషన్‌ను మాత్రం పక్కన పెట్టలేదు. వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ‘రంగస్థలం, మహానటి, యుటర్న్’ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సమంత.. ఇప్పుడు తన భర్తతో కలిసి ‘మజిలీ’లో నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 


తమిళ చిత్రం 'సూపర్ డీలక్స్' .. ఈ నెల 29వ తేదీన అక్కడ విడుదల చేస్తున్నారు. ఇదే రోజున తెలుగులోను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. సమంత ప్రధాన పాత్రధారిగా చేసిన 'ఓ బేబీ' కూడా ఈ వేసవిలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాను మాత్రం తమిళంలో కాకుండా తెలుగులో మాత్రమే విడుదల చేయనున్నారు. ఈ మూడు సినిమాలు కూడా కథాకథనాల పరంగా విభిన్నమైనవి.

Latest News
 
ఫ్యామిలీ స్టార్ : నంద నందనా వీడియో సాంగ్ అవుట్ Tue, Apr 23, 2024, 06:40 PM
'హరోమ్ హర' లోని కనులెందుకో సాంగ్ ప్రోమో అవుట్ Tue, Apr 23, 2024, 06:38 PM
TFDA సంక్షేమానికి 35 లక్షలు విరాళంగా ఇచ్చిన ప్రభాస్ Tue, Apr 23, 2024, 06:35 PM
OTT : విడుదల తేదీని లాక్ చేసిన 'నయట్టు' తెలుగు వెర్షన్ Tue, Apr 23, 2024, 06:30 PM
తన తొలి కన్నడ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఐశ్వర్య రాజేష్ Tue, Apr 23, 2024, 06:20 PM