ప్రభాస్ లో ఇంతవరకూ అలసట చూడలేదు: కెన్నీ బేట్స్

by సూర్య | Sat, Mar 16, 2019, 03:08 PM

బూమ్.. అంటూ షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 వీడియో తడాఖా చూపిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ‘బాహుబలి’ చిత్రంతో ఖండాంతరాలు దాటిన ఆయన క్రేజ్.. ‘సాహో’ మేకింగ్ వీడియోలతో రెట్టింపయ్యేలా ఉంది. ప్రభాస్ ఇమేజ్‌ను తగ్గట్లుగా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని సుమారు రూ. 200 కోట్లతో రూపొందించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మందిరా బేడి, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్ తదితరులు బాలీవుడ్ దిగ్గజాలు నటించారు.

హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ 'కెన్నీ బేట్స్' ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. "యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సాధారణంగా హై రిస్క్ వుండే యాక్షన్ సీన్స్ చేసిన తరువాత చాలామంది హీరోలు అలసిపోతుంటారు. అలాంటి అలసట నేను ఇంతవరకూ ప్రభాస్ లో చూడలేదు. ఉదయాన్నే సెట్స్ కి వచ్చినప్పుడు ఆయన ఎలా అయితే ఉత్సాహంగా ఉంటాడో .. ఆ రోజంతా కూడా ఆయన అంతే ఉత్సాహంగా ఉంటాడు. యాక్షన్ సీన్స్ చేసే విషయంలో ఆయనకి ఎంతమాత్రం సందేహం లేకపోవడం .. బెదురు లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది" అని చెప్పుకొచ్చారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM