తన మరణం పై వస్తున్న వార్తలపై స్పందించిన సునీల్

by సూర్య | Sat, Mar 16, 2019, 12:59 PM

యూ ట్యూబ్ ఛానెల్స్ తీరు రోజురోజుకీ దిగ‌జారిపోతుంది. ఏం చేసైనా స‌రే.. వాళ్ల‌కు క్లిక్స్ వ‌స్తే చాలు అనుకుంటున్నారు వాళ్లు. అందుకే ఎంత‌కు దిగ‌జార‌డానికైనా సిద్ధ‌మే అంటున్నారు. దానికోసం నైతిక విలువ‌లను కూడా తుంగ‌లో తొక్కేస్తున్నారు.

టాలీవుడ్ హీరో సునీల్ కారు ప్రమాదంలో మరణించారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన్ను కడసారిగా చూసేందుకు టాలీవుడ్ ప్రముఖులు వచ్చినట్లు మార్ఫింగ్ ఫొటోలను వాటికి జతచేశారు.ఈ విషయం చివరికి సునీల్ దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విట్టర్ లో స్పందించాడు. ఇలాంటి వార్తలను నమ్మవద్దనీ, తాను క్షేమంగా ఉన్నానని సునీల్ తెలిపాడు. దయచేసి ఇలాంటి కథనాలతో ఆందోళనకు గురికావద్దనీ, వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన సునీల్.. సదరు నకిలీ వదంతికి సంబంధించిన క్లిప్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Latest News
 
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM
'గుంటూరు కారం' 7వ పాట విడుదలపై తమన్ సూచన Thu, Apr 25, 2024, 03:44 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో 'చారి 111' Thu, Apr 25, 2024, 03:42 PM
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM