'మజిలీ' లో సమంత-నాగ చైతన్య జీవించారట !

by సూర్య | Sat, Mar 16, 2019, 12:11 PM

టాలీవుడ్ రొమాంటిక్ రియల్ లైఫ్ కపుల్స్ సమంత, నాగచైతన్య నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘మజిలీ’. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విడుదల తేదీని కన్ఫామ్ చేసుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే టీజర్‌తో పాటు రెండు సాంగ్స్‌ని విడుదల చేయగా.. గురువారం నాడు మూడో సాంగ్‌ను విడుదల చేశారు.

చైతు – సమంతల మధ్య వచ్చే సన్నివేశాలు మరియు వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వచ్చిందట. ముఖ్యంగా భార్యభర్తల్లా సామ్ – చై చాలా సహజంగా నటించారని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే జీవించారని చెప్పాలట. ఇక ఈ సినిమాలో చైతు రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. యంగ్ గెటప్ లో ఒకలా.. సమంతతో పెళ్లి తరువాత గెడ్డంతో మరో గెటప్ లో కనిపించనున్నాడు. 


ఈ చిత్రంలో సమంత, నాగ చైతన్యలతో పాటు దివ్యాంశ కౌశిక్‌ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండి. 

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM