నాకు నటనంటే ఇష్టమే...కానీ

by సూర్య | Sat, Mar 16, 2019, 11:29 AM

పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి.ఈ తరం ప్రేక్షకులకు ఏమో కానీ ఓ 15 ఏళ్లు వెనక్కి వెళ్తే ఈ పేరు తెలియని ప్రేక్షకుడు ఉండరేమో. అంతగా తన అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది ఈ పొడుగు కాళ్ల సుందరి..నా పాత సినిమాలు చూసినప్పుడు సోఫా కింద దాక్కునేదానని బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి తెలిపింది. నాకు అవకాశాలు ఎలా వచ్చాయని ఆశ్చర్యపోయేదాన్ని. ఇదంతా విధి. అపజయాలు చవి చూడకుండా విజయం సాధించిన వ్యక్తులు ఎవరూ లేరు. మిమ్మల్ని ఈ ప్రపంచం తిరస్కరిస్తేనే మీలోని ప్రతిభ బయటపడుతుంది. కెరీర్‌ తొలినాళ్లలో నన్ను ప్రజలు నటిగా అంగీకరించినట్లు నాకు అనిపించలేదు. బహుశా నేను అంత మంచి నటిని కానేమో. ‘‘ఫిర్‌ మిలేంగే’, ‘ధడ్‌కన్‌’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించినా నాకు ఒక్క అవార్డు కూడా రాలేదు. దీంతో నన్ను తిరస్కరించారన్న ఫీలింగ్‌ ఏర్పడింది. బాధగానూ అనిపించింది. కానీ శ్రమిస్తూనే వచ్చా. దేశానికి దూరంగా వెళ్లి ఏదైనా చేయాలి అనుకున్నా. అంతర్జాతీయ రియాల్టీ షో ‘బిగ్‌ బ్రదర్‌’లో పాల్గొన్నా. తొలిసారి నేను గెలుచుకున్నా (అవార్డు), చాలా షాక్‌ అయ్యా. నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 25 ఏళ్లు అవుతోంది. నాకు తొలుత లభించిన ఆదరణ, ప్రేమ కన్నా.. ఇప్పుడే ఎక్కువ లభిస్తోంది అనిపిస్తోంది. నాకు నటనంటే ఇష్టమే. కానీ కుమారుడు జన్మించిన తర్వాత వాడితోనే ఉండాలి అనిపించింది. అందుకే సినిమాలకు దూరమయ్యాన‌ని చెప్పింది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM