తమన్నాని పెళ్లిచేసుకుంటా అంటున్న శృతి హాసన్

by సూర్య | Fri, Mar 15, 2019, 05:00 PM

అసలు ఇద్దరు హీరోయిన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు దాదాపు అందరు స్టార్ హీరోయిన్లు ఇతర హీరోయిన్లతో చక్కగా స్నేహంగానే మెలుగుతున్నారు. అయితే అందరిలోనూ శృతి హాసన్ మరియు తమన్నా ల స్నేహం మాత్రం రోజురోజుకీ శృతి మించిపోతూ వస్తోంది. ఇద్దరూ ఒకళ్ళతో ఒకరు ప్రేమగా మెలుగుతున్నారు. మొన్నటికి మొన్న అనుకోకుండా ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్న తమన్నా, శృతి హాసన్ ఒకరినొకరు కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియా లో ఒక రేంజిలో హల్ చల్ చేసింది.  ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో శృతి చేసిన కామెంట్లు మరొకసారి సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. "మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్ ని పెళ్లాడతారు?" అని ఒక మీడియా ఇంటర్వ్యూలో శృతిని ప్రశ్నిస్తే, ఆమె "ఇంకెవరు? తమన్నాని పెళ్లాడేస్తాను. తనంటే నాకు అంత ఇష్టం. చాలా మంచిది. అస్సలు వదిలి పెట్టేదానిని కాదు" అంటూ చెప్పుకొచ్చింది శృతి. ఈ హంగామా చూసి అసలు శృతి, తమన్నా ల మధ్య ఉంది స్నేహం మాత్రమేనా అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వరుస సినిమాలతో తమన్నా, పెర్సనల్ లైఫ్, మ్యూజిక్ తో శృతి హాసన్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు.


 





Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM