మానసికంగా లైంగికంగా వేధించారు-నటి విజయలక్ష్మీ

by సూర్య | Thu, Mar 14, 2019, 10:04 PM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటి విజయలక్ష్మీ.. తనను నటుడు రవి ప్రకాశ్‌ మానసికంగా లైంగికంగా వేధించిన్నట్లు పుట్టేనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. తను కొద్దిరోజుల నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఫిబ్రవరి 27న నటుడు రవిప్రకాశ్‌ ఆస్పత్రికివచ్చి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశార‌ని,. త‌రువాత‌ ప్రతిరోజూ ఐసీయూకు రావడం, పదేపదే ఫోన్‌ మేసెజ్‌లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవారన్నారు. ఆమె ఆరోపణలను నటుడు రవి ప్రకాశ్‌ ఖండించారు. మీడియాలో సాయం చేయాలని కోరటం వల్ల ఆమెకు లక్ష రూపాయలను సాయం చేశాను గానీ లైంగికంగా వేధించలేదని చెప్పారు. ఆమెతో తను మాట్లాడిన కాల్‌ రికార్డ్‌ ఉందన్నారు. కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయటమే తప్పా అన్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM