శృతి హాసన్ ఇలా అవ్వడానికి తన బాయ్ ఫ్రెండే కారణమా ?

by సూర్య | Thu, Mar 14, 2019, 06:49 PM

ఒక‌ప్పుడు శృతి హాస‌న్ అంటే వ‌ర‌స సినిమాల‌తో పాటు మ్యూజిక్ షోస్ కూడా చేస్తూ బిజీ బిజీగా ఉండేది. కానీ ఎప్పుడైతే బాయ్ ఫ్రెండ్ మైఖెల్ కోర్సెల్ ఆమె జీవితంలోకి వ‌చ్చాడో అప్ప‌ట్నుంచే శృతి కూడా మారిపోయింది. అస్స‌లు సినిమాలు చేయ‌డం లేదు.. ఎందుకు దూరంగా ఉందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు కూడా ఈమె సినిమాలకు దూరంగా మ్యూజిక‌ల్ షోల‌కు ద‌గ్గ‌రగా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. పైగా తాను చాలా ఆనందంగా ఉన్నానంటూ.. ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఉత్సాహంగా ఉన్నాన‌ని చెబుతుంది శృతి హాస‌న్.

దీనికి కార‌ణం కూడా ఎవ‌రో చెప్ప‌డం లేదు ఈ ముద్దుగుమ్మ‌. అయితే ప్ర‌స్తుతం ముంబైలో ఓ ఫ్లాట్ తీసుకుని బాయ్ ఫ్రెండ్ మైఖెల్ కోర్సెల్‌తో స‌హ‌జీవ‌నం చేస్తుంద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది శృతి హాస‌న్. ఎందుకో తెలియ‌దు కానీ మెల్ల‌మెల్ల‌గా సినిమాల నుంచి దూరం అయిపోతుంది ఈ భామ‌. రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. పూర్తిగా న‌ట‌న మానేసి సంగీతం వైపు అడుగేస్తుంది శృతిహాస‌న్.

సినిమాల్లోకి రాక‌ముందే ఈమె గాయ‌కురాలిగా పేరు తెచ్చుకుంది. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఈనాడు సినిమాకు సంగీత ద‌ర్శ‌కురాలిగా కూడా ప‌ని చేసింది. ఇక సినిమాలు మానేసి.. హాయిగా రాక్‌స్టార్‌గా ఫిక్స్ అయిపోవాల‌ని ఆ మ‌ధ్య ఫిక్సైపోయింది శృతి హాస‌న్. త‌న టీం మొత్తాన్ని సిద్ధం చేసుకుని స్టేజ్ షోలు కూడా ఇవ్వ‌డానికి రెడీ అయింది కూడా. ఆ మ‌ధ్య ఫారెన్ టూర్స్ కూడా ప్లాన్ చేసింది ఈ భామ‌. వ‌ర‌స‌గా మ్యూజిక్ ప్రిప‌రేష‌న్స్‌తోనే బిజీగా ఉండేది శృతిహాస‌న్.

అందాల ఆరబోత‌లో ర‌ప్ఫాడించే ఈ ముద్దుగుమ్మ ఉన్న‌ట్లుండి ఇలా సినిమాల నుంచి త‌ప్పుకోవ‌డం అభిమానుల‌కు షాకే. అయితే ఇప్పుడు మాత్రం విజ‌య్ సేతుప‌తి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తుంది ఈ భామ‌. జ‌యంత‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టించ‌బోయే లాభం సినిమాలో హీరోయిన్ గా శృతి హాస‌న్ న‌టించ‌బోతుంద‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది. జ‌గ‌ప‌తిబాబు ఈ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. ఏదేమైనా కెరీర్ విష‌యంలో ప్ర‌స్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నాన‌ని చెబుతుంది ఈ భామ‌. 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM