ఈనెల 24న విడుదల కానున్న సౌండ్ పార్టీ

by సూర్య | Tue, Nov 21, 2023, 04:09 PM

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీశ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా ఈనెల 24న థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు. సీనియర్ నటి ఆమని మా అత్త అవటంతో చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేదని, చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కూడా నటించానని, అల్లంత దూరాన సినిమా తర్వాత హీరోయిన్ గా తెలుగులో నాకు ఇది రెండో చిత్రమని ఇందులో నేను సిరి అనే ఇంపార్టెంట్ పాత్రలో నటించానని తెలిపింది. సంజయ్ గారు కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించిందని, ఇది ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్, కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.

Latest News
 
ఈ యువ దర్శకుడితో కలిసి పనిచేయాలని భావిస్తున్న నాని Mon, Dec 04, 2023, 08:39 PM
బిగ్ బాస్ 7 తెలుగు : నామినేషన్లలో ప్రశాంత్‌ను కార్నర్ చేసిన హౌస్‌మేట్స్ Mon, Dec 04, 2023, 08:36 PM
'దేవర' ఇంటర్వెల్ సీక్వెన్స్ కి భారీ సెట్ Mon, Dec 04, 2023, 08:13 PM
'ఫైటర్' నుండి హృతిక్ రోషన్ క్యారెక్టర్ పోస్టర్ అవుట్ Mon, Dec 04, 2023, 08:02 PM
నార్త్ అమెరికాలో హాలీవుడ్ చిత్రాలను అధిగమించిన 'యానిమల్' Mon, Dec 04, 2023, 07:59 PM