by సూర్య | Mon, Nov 20, 2023, 08:38 PM
సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ డ్రామా 'పొలిమెరా 2' నవంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 13వ రోజు 0.19 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ సినిమాలో బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి, సాహితీ దాసరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.
Latest News