రెండు నిమిషాల 'కళంక్‌' టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచింది

by సూర్య | Wed, Mar 13, 2019, 04:42 PM

రాజులు, కోటలు.. పగ, ప్రేమలు.. కన్నీళ్లు, మత కల్లోలాలు.. అబ్బురపరిచే నృత్యాలు, ఔరా అనిపించే పోరాటాలు.. రెండు నిమిషాల కళంక్‌ టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ప్రేక్షకులకు ఓ సృష్టత వచ్చింది. సంజయ్‌దత్‌, మాధురీ దీక్షిత్‌, ఆదిత్యారాయ్‌ కపూర్‌, సోనాక్షీ సిన్హా. వరుణ్‌ ధావన్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర కథ భారత స్వాతంత్య్రానికి ముందు, 1945 నేపథ్యంలో సాగుతుంది. టీజర్‌లో వేరొకరి తప్పుల్ని మన విజయంగా భావిస్తే.. మనకంటే పెద్ద తప్పు చేస్తున్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అని అలియా భట్‌ చెప్పే డైలాగ్‌, చివర్లో కళంక్‌ నహీ ఇష్క్‌, హై అని వచ్చే పాట ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఏప్రిల్‌ 17న ఈ సినిమా విడుదల కానుంది.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM