కమల్ హాసన్ వల్లనే 'భారతీయుడు 2' ఆగిందా !

by సూర్య | Wed, Mar 13, 2019, 04:09 PM

శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా 'భారతీయుడు 2' రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. మూడవ షెడ్యూల్ కి సంబంధించిన అప్ డేట్స్ బయటికి రాకపోవడంతో, ఈ సినిమా షూటింగు ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. దర్శక నిర్మాతల మధ్య తలెత్తిన విభేదాలే అందుకు కారణమనే టాక్ వచ్చింది.

కానీ అసలు కారణం అది కాదట .. ప్రస్తుతం తన రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కమల్ తీరికలేకుండా ఉన్నారట. ఎన్నికలు పూర్తయిన తరువాత షూటింగు పెట్టుకోవలసిందిగా ఆయన కోరడంతో, దర్శక నిర్మాతలు ఆ తరువాతనే 3వ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. కొంత సమయం తీసుకుని మళ్లీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM